05-07-2025 12:00:00 AM
ఖమ్మం, జూలై 4 2025 (విజయ క్రాంతి) : జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవనంలో జరిగిన ప్రజాసంఘాల ఐక్యవేదిక సమావేశం సిఐటియు జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీర భద్రం పాల్గొని మాట్లాడుతూ మోడీ పాలనలో గత 10 ఏళ్ళుగా స్వదేశీ, విదేశీ పారిశ్రామికవేత్తల ఆర్థిక ప్రయోజనాల కోసం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, 4 లేబర్ కోడ్లను తెచ్చారు. 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పొడిగించేందుకు, పని భారం పెంచేందుకు శ్రీకారం చుట్టారని యూనియన్లు పెట్టుకునే హక్కును నిరాకరిస్తున్నారని కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనాలివ్వాలన్న చట్టబద్ధ ఆదేశాలను, న్యాయస్థానాల తీర్పులను బుట్టదాఖలు చేస్తున్నారని వారు విమర్శించారు.
కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోన్నం వె ంకటేశ్వరావు ఐద్వారాష్ట్ర నాయకులు బుగ్గవీటి సరళ,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ బొంతు రాంబాబు సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్ ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మెరుగు రమణ బండి పద్మ వ్వసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగుసత్యనారాయణ, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యద ర్శులు ప్రభాకర్. బషీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు