04-07-2025 10:50:58 PM
అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెప్తాం
బిఆర్ఎస్ నాయకుల స్పష్ఠీకరణ
మందమర్రి,(విజయక్రాంతి): చెన్నూర్ నియోజకవర్గం అభి వృద్ధిపై ప్రశ్నిస్తున్న బిఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమే ష్ ను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని బిఆర్ఎస్ నాయకులపై అను చిత వ్యాఖ్యలు చేస్తే సహించే ది లేదని బిఆర్ఎస్ నాయకు లు మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు లౌడం రాజ్ కుమార్, బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు పెంచాల మదు, మండల పబ్లిసిటీ ఇంచార్జ్ తైదల జంపన్నలు హెచ్చరించారు. పట్టణ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పదవి ఉన్నా లేకున్నా వైద్యునిగా కొనసాగుతూ సమాజ సేవే పరమావధిగా జిఎస్ఆర్ ఫౌండేషన్ స్థాపించి అనేక మంది నిరుపేదలకి సేవా కార్యక్రమాలు అందించిన గొప్ప వ్యక్తి రాజా రమేష్ అని అలాంటి వ్యక్తిని విమర్శించడం సిగ్గుచేటని వారు అన్నారు.
గత పది సంవత్సరాలుగా చెన్నూరు నియోజకవర్గం అభి వృద్ధి చెందలేదని విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులకు చెన్నూ రు మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చేపట్టిన అభివృద్ధి పనులు కళ్లకు కనిపించడం లేదా అని వారు ప్రశ్నించారు. చెన్నూరు బస్ డిపో, వంద పడకల ఆసుపత్రి, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ, వంతెనలు, రోడ్లను నిర్మించి నియోజకవర్గంను అభివృద్ధి చేసిన ఘనత బాల్క సుమన్, బిఆర్ఎస్ ప్రభుత్వా నికే దక్కుతుందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని కాంగ్రెస్ హయాంలోనే చెన్నూర్ అభివృద్ధి సాధించిందని చెబు తున్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ హయాంలో రైల్వే బ్రిడ్జిలు, మినీ ట్యాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్, మార్కెట్ యార్డులు, 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, చెన్నూరు లో బస్ డిపో, వంటివిఎందుకు ఏర్పాటు చేయలేదని వారు నిలదీశారు.
ఎన్నికల సందర్భం గా చెన్నూరు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి స్కిల్ డెవలప్ సెంటర్లు ఏర్పా టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ లో బైక్ కంపెనీ ఏర్పాటు చేయడంలో చూపెట్టిన శ్రద్ధ చెన్నూరులో ఎందుకు చూపెట్ట లేదని, అదే పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేస్తే స్థానికులకు ఉపాధి దక్కే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయలేదని దీనిని బట్టి చూస్తే చెన్నూర్ ప్రజలపై ప్రేమ ఏపాటిదో ఇట్టే తెలుస్తుందని వారు ఎద్దేవా చేశారు. రైతు ప్రభుత్వం అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 18 నెలలుగా రైతుల కు రైతు భరోసా, రైతు రుణ మాఫీ పూర్తి స్థాయిలో అందిం చడoలో పూర్తిగా విఫలమైంద ని వారు మండిపడ్డారు. ఇప్ప టికైనా కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ నాయకుల పై అనుచిత వ్యాఖ్యలు మాను కోవాలని లేకుంటే రానున్న రోజుల్లో నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని వారు స్పష్టం చేశారు.