29 July, 2026 | 10:00 PM

Breaking News

గురువుల ను సన్మానించిన అమ్ము స్వచ్ఛంద సంస్థ   •   బాధితులకు సత్వర న్యాయం.. సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది   •   బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •   సిఐ నీలం రవికి ఘన సన్మానం   •   మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •  

సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

29-07-2026 09:13 PM

మంథనిలో సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

మంథని, జూలై 29(విజయ క్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు  సహోదరి, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య సతీమణి శ్రీమతి సువర్ణ వనమాల  దశదిన కార్యక్రమం బుధవారం మంథని పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నివాళులర్పించిన శ్రీను బాబు:

కార్యక్రమంలో భాగంగా దుద్దిళ్ల శ్రీను బాబు  సువర్ణ వనమాల  చిత్రపటానికి పూలమాలలు వేసి, భావోద్వేగంగా ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని వ్యక్తిగతంగా పరామర్శించారు. సువర్ణ వనమాల  సేవలను, జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారికి కొండంత ధైర్యం చెబుతూ ఓదార్పునందించారు.

శ్రీను బాబు తో పాటు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు,  అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని స్వర్గీయ సువర్ణ వనమాల కి అశ్రునయనాల మధ్య నివాళులర్పించారు.