calender_icon.png 16 December, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశయం ఉన్న వారిని గెలిపించండి

11-12-2025 12:00:00 AM

ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు

బెజ్జూర్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): ఆశతో కాదు ఆశయంతో ఉన్న వారిని గెలిపించండి అని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పిలుపునిచ్చారు. దహెగాం మండలంలోని అయినం, కొత్మిర్, జెండాగూడ, రాళ్లగూడ గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు బొర్కుట్ మోహన్, నాయికిని సత్యనారాయణ, వెన్నంపల్లి సుధాకర్‌కు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ గ్రామాభివృ ద్ధికి నిజమైన ఆశయంతో ముందుకు వచ్చే అభ్యర్థులకు అవకాశమివ్వాలని గ్రామస్తులను కోరారు. అయినం గ్రామంలోని ఎస్సీ కాలనీకి సిసి రోడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.జెండాగూడ గ్రామానికి బ్రిడ్జి , బీటీ రోడ్డు మంజూరు చేయించినట్లు, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.

కొత్మీర్ నుంచి దహెగాం వరకు డబుల్ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయని, మరికొద్ది రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి కొప్పుల శంకర్, సింగిల్ విండో చైర్మన్ తిరుపతి గౌడ్, సూర పురుషోత్తం, సందీప్, శంకర్, శోభన్ గౌడ్, రామ్టెంకి సురేష్, మహేష్, సాయి కృష్ణ, హరి తదితరులు పాల్గొన్నారు.