11-12-2025 12:00:00 AM
ములకలపల్లి, డిసెంబర్ 10,(విజయక్రాంతి):సీతారాంపురం గామపంచాయతీలో పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉండగా రెబల్ గా నామినేషన్ వేసి పోటీలో ఉన్న మాజీ సర్పంచ్ సున్నం సుశీల, వడ్డే హనుమంతరావును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. బుధవారం ములకలపల్లిలో ఏర్పాటైన ఆ పార్టీ మండల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మండల పార్టీ నాయకులు విలేకరులకు తెలిపారు.
పార్టీ క్రమ శిక్షణా చర్యల్లో భాగంగా సీతారాంపురం గ్రామ పంచాయితీకి చెందిన వడ్డె హనుమంతరావు, సున్నం సుశీల పనితీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నందున, పార్టీ నియోజికవర్గ, మండల నాయకులపట్ల పరుష పదజాలం వాడుతున్నందున వారివురికి బిఆర్‌ఎస్ పార్టికి ఎటువంటి సంబంధం లేదని వారు ప్రకటించారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు మొరంపూడి అప్పారావు, తాండ్ర రాంబాబు, బండి కొమరయ్య, శనగపాటి సీతారాములు, నాగమణి, పున్నమ్మ, చందర్రావు, సుధాకర్, కృష్ణ ప్రసాద్, ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.