11-12-2025 12:00:00 AM
టేకులపల్లి, డిసెంబర్ 10,(విజయక్రాంతి):గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్ గ్రామంలోని రైతు వేదిక వద్ద టేకులపల్లి ఎంపీడీవో మల్లేశ్వరి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. సర్పంచ్ అభ్యర్థులు రూ. లక్ష్మన్నర, వార్డు సభ్యులు రూ. 30 వేల వరకు ఎన్నికల ఖర్చు చేయొచ్చు అన్నారు. పోటీ చేసిన అభ్యర్థులకు అధికారులు ఇచ్చిన ఎన్నికల ఖర్చులు ఎప్పటికప్పుడు రాయాలన్నారు.
అభ్యర్థులు బ్యాంకు పోస్ట్ ఆఫీస్ ల ద్వారా తీసుకున్న ఎకౌంటు పుస్తకం ద్వారానే నిర్వహించాలన్నారు. అనుమతి లేకుండా వాహనాలతో ప్రచారం చేయకూడదని చేయకూడదని, ఏ పంచాయతీ వాహనం ఆ పంచాయతీలో మాత్రమే ప్రచారం నిర్వహించుకోవాలని లేనిచో కేసులు నమోదు అవుతాయని తెలిపారు. నేటి నుంచి ఎన్నికలు పుట్టే వరకు అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఇల్లందు డి ఎఫ్ సి చంద్రభాను మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని అనవసర గొడవలకు దిగి కేసుల్లో ఇరుక్కోవద్దని సూచించారు. మద్యం చేయొద్దని తెలిపారు. కార్యక్రమంలో టేకులపల్లి ఎస్త్స్ర రాజేందర్, ఎంపీ ఓ గణేష్ గాంధీ, ఎన్నికల ఖర్చుల నిర్వహణ అధికారి తదితరులు పాల్గొన్నారు.