ఆశ్చర్యచకితులను చేసే కాన్సెప్ట్‌తో ఐయామ్ గేమ్
డైరెక్టర్ నాగ్‌అశ్విన్
దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’. వే ఫేరర్ ఫిలమ్స్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 3న విడుదల చేయనుంది. ఈ సందర్భంగా మేకర్స్ మంగళవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ వేడుకకు విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగ్‌అశ్విన్ మాట్లాడుతూ.. “ఈ సినిమా నేను కొంత చూశాను. ఇందులోని కాన్సెప్టుకు ప్రేక్షకులందరూ సర్‌ప్రైజ్ అవుతారు. ఇందులో చాలా ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్ ఉంటాయి” అన్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “ఇది నా ప్రొడక్షన్‌లో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్.
నేను నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌తో మాట్లాడుతున్నప్పుడు.. ఇది తెలుగులో తీసిన ఒక పెద్ద సినిమాలాగే ఉంది అని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు హీరోలను ఆదరించడంలో చూపించే ప్రేమను మాటల్లో చెప్పలేం. నన్ను కూడా ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాకు స్వయంగా డబ్బింగ్ చెప్పాను” అని చెప్పారు. ‘తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాన’ని నిర్మాత సందీప్ గుణ్ణం తెలిపారు. ఈ వేడుకలో ఆంటోనీ వర్గీస్, కదిర్, సంయుక్త విశ్వనాథన్ కూడా మాట్లాడారు.






