calender_icon.png 29 September, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2న హైదరాబాద్‌లో మాలల మహా రణభేరి

29-09-2025 12:28:07 AM

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య వెల్లడి

మణుగూరు, సెప్టెంబర్ 28  (విజయక్రాంతి) :మాలలు, మాల ఉపకులాల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 2న మాలల రణభేరి పేరిట మహాసభను  నిర్వహిస్తున్నామని, మాల మహానాడు జాతీ య అధ్యక్షుడు జి. చెన్నయ్య  తెలిపారు. ఆ దివారం  సమితి సింగారంలోని శ్రీశ్రీ నగ ర్ లో  మాల మహానాడు మండల  కార్యాలయాన్ని ఆయన  ప్రారంభించి మాట్లాడా రు. ఎస్సీ వర్గీకరణ ద్వారామాలలకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు.

కొత్తగా తీసుకొచ్చిన రొస్టర్ విధానంతో విద్య, ఉద్యోగాలలో మాలలు నష్టపోతున్నారని చెప్పారు. ఎంపిరికల్ డేటాను పరిగణనలోకి తీసు కోకుండా, జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వర్గీకరణ చేశారనివిమర్శించారు. మాలల హక్కులనుకాపాడుకునేందుకు నవంబర్ 2న చలో హైదరాబాద్ మాలల రణభేరి మహాసభను నిర్వహించడం జరుగుతుందన్నారు. మాలలు లక్షలాదిగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులు పప్పుల జాన్, రంజిత్ కుమార్, రాష్ట్ర నాయకులుశివకుమార్, జిల్లా అధ్యక్షులు నవతన్, మాల విద్యుత్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు బూర్గుల విజయభాస్కర్, చాకలి ఐలమ్మ ముని మనవరాలు చిట్యాల శ్వేత, మండల గౌరవ అధ్యక్షులు మద్దెల భద్రయ్య, అధ్యక్ష కార్యదర్శులు వేర్పుల నరే ష్, బూర్గుల సతీష్, కోశాధికారి చింత  మల్ల రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ లు దాస రి వెంకట్, వేర్పుల సురేష్, ఉపాధ్యక్షులు బూర్గుల సంజీవరావు తదితరులుపాల్గొన్నారు.