29-09-2025 12:28:02 AM
అమీన్ పూర్, సెప్టెంబర్ 28 :పటాన్చెరు ఎమ్మెల్యే జిఎంఆర్ తో కలిసి అమీన్ పూర్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో డొనేట్ కార్ట్ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 15 మంది దివ్యాంగులకు త్రిచక్ర సైకిళ్ళను అమీన్ పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి పంపిణీ చేశారు.
డొనేట్ కార్డ్ స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి,మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ ఎంపీపీ దేవానం దం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి,స్వచ్ఛం ద సంస్థ ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్ కృష్ణ, కల్పన ఉపేందర్ రెడ్డి, కొల్లూరు చంద్రకళ గోపాల్, నవనీత జగదీష్ ,కో ఆప్షన్ సభ్యులు తల్లారి రాములు, సీనియర్ నాయకులు కొల్లూరు యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.