26 August, 2026 | 8:48 PM

సమాచార కమిషనర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

11-06-2024 06:54 PM

హైదరాబాద్ : ప్రధాన, రాష్ట్ర సమాచార కమిషనర్ ల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామకానికి సంబంధించిన దరఖాస్తులను  జూన్ 29వ తేదీ వరకు పంపించాలని ప్రభుత్వం తెలిపింది. గతం ప్రభుత్వ హయాంలోనూ సమాచార కమిషనర్ల నియమకానికి అధికారులు దరఖాస్తులను స్వీకారించారు.  ప్రధాన సమాచార కమిషన్ కోసం 40 దరఖాస్తులు, రాష్ట్ర సమాచార కమిషన్ పోస్టుల కోసం 273 దరఖాస్తులు వచ్చాయి. దీంతో గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు.