13 April, 2026 | 9:23 AM

మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసైనా మల్లయ్య పద్ధతి మార్చుకోవాలి

14-02-2026 01:07 AM

కోదాడ, ఫిబ్రవరి 13: మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసైనా బొల్లం మల్లయ్య తన పద్దతి మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాయపూడి వెంకటనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో అభివృద్ధి మంత్రం పనిచేసిందన్నారు.

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పద్మావతిల మానస పుత్రిక సన్న బియ్యం పథకం అద్భుతంగా పనిచేసిందన్నారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిపై  నమ్మకంతో 35 సీట్లకు గాను 27 సీట్లు అందించిన కోదాడ పట్టణ ప్రజలకు రాయపూడి వెంకటనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పద్మావతి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.