30 August, 2026 | 4:00 AM

వసంతరాణి భౌతికకాయానికి మల్లన్న నివాళి

30-08-2026 01:43 AM

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌ను పరామర్శించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న   

చంగిచర్ల, ఆగస్టు 29 (విజయక్రాంతి): ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం తల్లి వసంత రాణి మృతి పట్ల ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అ ధ్యక్షులు తీన్మార్ మల్లన్న సంతాపం వ్య క్తం చేశారు. శనివారం చంగిచర్లలోని ప్రీతం నివాసానికి వెళ్లిన మల్లన్న ఆయన్ని, కుటుం బ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

ఈ సందర్భంగా వసంత రాణి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ వి షాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. తాము కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.