30 August, 2026 | 2:52 AM

మీ పని తీరులో మార్పు కనిపించాలి

30-08-2026 01:43 AM

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

శాఖల పని తీరుపై అధికారులతో మంత్రి సమీక్ష

సూర్యాపేట, ఆగస్టు 29 (విజయక్రాంతి): సానుకూల దృక్పథంతో అధికారులు ప్ర జాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం సూర్యాపే ట  సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మంది రంలో నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే, గృహ నిర్మాణ శాఖల సమీక్ష సమావేశంలో మంత్రి కోమ టిరెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు.

తహ సీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ల పనితీరులో తప్పనిస రిగా మార్పులు కనిపించాలన్నారు. ప్రజల ను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఎక్కడ చే యకూడదన్నారు. భూములకు సంబంధిం చి 45 దరఖాస్తులు తన లాగిన్ లోనే ఎక్కు వ రోజులు ఉంచుకోవడంపై యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డ గూడూరు తహసీల్దార్ ను  వివరణ కోరాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న భూ సమస్యలను పరి ష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తుందని ఇది పకడ్బందీగా అమలు అయ్యేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధి దారులకు ఎక్కడ సమస్య రాకుండా చూడా లన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రతిష్ఠాత్మకం గా చేపట్టిందని వాటి అమలులో ఎక్కడ ఇ బ్బంది రాకుండా చూడాలని అధికారులకు సూచించారు.

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామేలు, కుందూరు జైవీర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యంలు పలు అంశాలను సమా వేశం దృష్టికి తీసుకువచ్చారు.  సమా వేశం లో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, సూర్యా పేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఉమ్మడి నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సబ్ రిజిస్టర్లు, సర్వే ల్యాండ్ రికారడ్స్ ఏడీలు, తహసీల్దా రులు, పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.