1 July, 2026 | 9:26 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

కాల్వపల్లి తండా సర్పంచ్ అభ్యర్థిగా మాలోతు సక్రు నాయక్ నామినేషన్

03-12-2025 02:14 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్య పేట జిల్లా మఠంపల్లి మండలంలోని కాల్వపల్లి తండా గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన మాలోతు సక్రు నాయక్ బుధవారం అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధి పట్ల స్పష్టమైన దృష్టి, ప్రజాసేవ పట్ల నిబద్ధతతో ముందుకు వచ్చిన మాలోతు సక్రు నాయక్ కు గ్రామస్తులు, కార్యకర్తలు, యువత, పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు.నామినేషన్ కార్యక్రమం ఉత్సహభరిత వాతావరణం లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామ ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక పరిపాలన నా లక్ష్యం,గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.