calender_icon.png 3 December, 2025 | 2:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్యాగశీలి అమరుడు శ్రీకాంతాచారి

03-12-2025 02:18:23 PM

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మలి దశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతా చారి జీవితం అజరామరం అని  మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రం అమరుడు శ్రీకాంత చారి వర్థంతి సందర్భముగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ సూర్య చంద్రులు ఉన్నంత వరకు శ్రీకాంతాచారి త్యాగం గుర్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ గుండగాని కవిత,రాములు గౌడ్  జిల్లా నాయకులు గుండగాని దుర్గయ్య. గుండగాని వీరయ్య. పోలేపాక సోమయ్య. కట్ల చంద్రయ్య ,పోలేపాక పరమేష్. గుండగాని లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.