calender_icon.png 3 December, 2025 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడిబండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పులి తిరుపతిబాబు నామినేషన్

03-12-2025 02:11:47 PM

కోదాడ: కోదాడ మండలం గుడిబండ గ్రామంలో  గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థిగా పులి తిరుపతిబాబు (ఆర్ఎంపీ) బరిలో ఉన్నారు. గ్రామ ప్రజలకు మంచికైనా, చెడుకైనా, ఏ సమస్య వచ్చినా ముందుండి సేవలందించే వ్యక్తిగా పులి తిరుపతిబాబు గ్రామంలో మంచి గుర్తింపు పొందారు. ఆర్ఎంపీగా సేవలందిస్తూ నిరుపేదలకు వైద్య సహాయం అందించడంలో ఎప్పుడూ ముందుండే ఆయన, గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చారు.

తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ చిన్న పెద్దలను గౌరవిస్తూ ఉంటాడు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు తనకు ప్రజల ఆశీర్వాదం అందించాలని పులి తిరుపతి బాబు కోరారు. గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరూ తనకు సహకరించాలని ఆయన కోరారు.