11 March, 2026 | 4:51 AM

ఇంటర్ పరీక్షలో 9 మాల్‌ప్రాక్టిస్ కేసులు

11-03-2026 12:00 AM

హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలో తొమ్మిది మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయు. మంగళవారం సెకండ్ ఇయర్ ఫిజిక్స్ 2, ఎకనామిక్స్ 2 పరీక్షలు జరిగాయి. 4,70,115 మంది విద్యార్థులకు గానూ 4,57,395 మంది (97.29 శాతం) మంది హాజరయ్యారు. 12,720 మంది గైర్హాజరయ్యారు. అయితే నిర్మల్‌లో 3, కరీంనగర్ 1, వరంగల్ 5 మాల్‌ప్రాక్టిస్ కేసులు నమోదైనట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. బుధవారం ఇంటర్ ఫస్టియర్‌కు సంబంధించిన ప్రధాన పరీక్షలు ముగియనున్నాయి. 

21వ నెంబర్ ప్రశ్నలో పొరపాటు

ఇదిలా ఉంటే ఫిజిక్స్ ప్రశ్నపత్రంలో 21వ నెంబర్ ప్రశకు సంబంధించి చిన్న పొరపాటు జరిగినట్లు పలువురు విద్యార్థులు తెలిపారు. తెలుగు మీడియంలో ఒకలా, ఇంగ్లీషులో మరోలా ప్రశ్నను అడిగారు. తెలుగులో అదనంగా మరో ప్రశ్నను జోడించారు. దీంతో విద్యార్థులు కాస్త గందరగోళానికి గురైనట్లు తెలిసింది.