11 March, 2026 | 3:19 AM

ముగిసిన పారా బ్యాడ్మింటన్ పోటీలు

11-03-2026 12:08 AM

హైదరాబాద్, మార్చి 10: పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా జరిగిన జాతీయ పారా బ్యాడ్మింటన్ పోటీలు విజయవంతంగా ముగిసాయి. మిక్స్‌డ్ డబుల్స్ ఎస్ ఎల్3-ఎస్‌యు5 ఫైనల్లో నితీష్ కుమార్, తులసిమతి మురుగేశన్ జోడీ 22-20, 21-7 స్కోరుతో ప్రమోద్ భగత్-మనీషా రామ్‌దాస్ జోడీపై విజయం సాధించింది. పురుషుల ఎస్ యు5 విభాగంలో శివమ్ యాదవ్ 21-14, 21-16 స్కోరుతో దేవ్ రాథీపై గెలుపొందాడు.

ఎస్‌హెచ్6 మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో కృష్ణ జోడీ, మహిళల ఎస్‌యు5 ఫైనల్‌లో మనీషా రామ్‌దాస్ ఛాంపియన్లుగా నిలిచారు. విజేతలకు భారత జాతీయ జట్టు కోచ్ పుల్లెల గోపీచంద్ ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హార్‌ఫుల్‌నెస్ డైరెక్టర్ మధుసూదన్‌రె డ్డి, బ్యాట్ ప్రతినిధులు యూవీఎన్ బాబు, కానూరి వంశీ, కోచ్ రాజేందర్ పాల్గొన్నారు.