12 July, 2026 | 2:16 PM

Breaking News

రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •   42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు   •   "సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   మద్రాస్ తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక   •   గాయని జానకి మృతికి విజయ్, నటులు, సంగీతకారులు సంతాపం   •   గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

కోల్‌కతాపై దాడి చేస్తామన్న పాక్.. మోదీపై మమతా బెనర్జీ విమర్శలు

06-04-2026 04:50 PM

మోదీ వైఖరిని తప్పుబట్టిన మమతా బెనర్జీ.. రాజీనామా చేయాలని డిమాండ్

కోల్ కతాపై దాడి చేస్తామన్న పాక్.. మోదీపై మమత సంచలన వ్యాఖ్యలు

కోల్‌కతా: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. ప్రధాని మోదీ రాజీనామా చేయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై మోదీ ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు. ఈ సారి యుద్ధం జరిగితే కోల్ కతాపై దాడి చేస్తామని పాక్ రక్షణమంత్రి అన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. పాక్ మంత్రి వ్యాఖ్యలపై మోదీ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని మండిపడ్డారు. ఎన్నికల కోసం మాత్రమే కోల్ కతాను పట్టించుకుంటారా? అని  బెంగాల్ సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.