అన్నను చంపిన తమ్ముడు అరెస్ట్
03-10-2024 03:34 PM
జగిత్యాల (విజయక్రాంతి): జగిత్యాల గ్రామీణ మండలం అంతర్గాం లో ఈ నెల 1వ తేదీన నన్నపునేని విద్యాసాగర్ రాజును తలపై రోకలి బండతో దాడి చేసి చంపిన తమ్ముడు నన్నపనేని విక్రమ్ రాజును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు జగిత్యాల డిఎస్పీ రఘు చందర్ తెలిపారు.






