2 September, 2026 | 9:22 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

అత్యాచారయత్నం.. 3 సంవత్సరాల జైలు శిక్ష

10-06-2024 | 02:41pm

రాజన్నసిరిసిల్ల, విజయక్రాంతి: మూడు సంవత్సరాల క్రితం బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 2 వేలుజరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత సోమవారం తీర్పు వెల్లడించినట్లు పట్టణ సిఐ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల పట్టణానికి చెందిన 10సంవత్సరాలు బాలికపై 2023 సంవత్సరంలో ఒంటరిగా ఇంటికి వెళ్లే సమయంలో రాజీవ్ నగర్ కు చెందిన కొండ రాహుల్ అనే వ్యక్తి బాలికను పక్కనే వున్న ఖాళీ స్థలంలోకి తీసుకొని పోయి ఆమెపై హత్యాచారనికి ప్రయత్నించగా అతని నుండి తప్పించుకొని కుటుంబసభ్యులతో కలిసి సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు  చేయగా, అప్పటి సిరిసిల్ల పట్టణ సీఐ అనిల్ కుమార్ నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష విధించినట్లు సీఐ బి.రఘుపతి తెలిపారు.