2 September, 2026 | 10:17 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

భూపాలపల్లిలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు యువకులు మృతి

10-06-2024 | 11:17am

రాంపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రాంపూర్- కమలాపూర్ గ్రామ శివారులో సోమవారం తెల్లవారుజామున ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను ఆర్ నరేష్ (30), ఆర్ ప్రమోద్ (25)గా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం, నరేష్, ప్రమోద్, సిద్ధూ తమ ద్విచక్ర వాహనంపై రాంపూర్ గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. నరేష్ అక్కడికక్కడే మృతి చెందగా, ప్రమోద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సిద్ధూ హన్మకొండలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.