2 September, 2026 | 8:36 PM

Breaking News

రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •   ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది రేవంత్ రెడ్డి.. ఖబర్దార్   •  

ప్రతి సమస్య ను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి

10-06-2024 | 03:07pm

మహబూబ్ నగర్: తన అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజల చేత స్వయంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  సోమవారం అర్జీలు స్వీకరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్జీలు ఇచ్చిన వారి సమస్యలను ఆయన సావధానంగా విన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణం పరిష్కారం అయ్యే సమస్యలకు ఆయన వెంటనే పరిష్కారించారు.  డబుల్ బెడ్రూం, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి , పెన్షన్లు పైన ప్రజలు ఎమ్మెల్యే కు అత్యధిక అర్జీలు అందజేశారు. వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ వల్ల కొన్ని రోజులుగా ప్రజల అర్జీలు తీసుకోలేక పోయామని, ఇకనుంచి ప్రతి రోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సమస్యలను తీర్చడానికి  నిరంతరం కృషి చేస్తానన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణ లో భాగంగా ఈ రోజు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం, రాజేంద్రనగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, షా బజార్ పాఠశాలను మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ , మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డితో కలిసి పరిశీలించారు.