calender_icon.png 29 January, 2026 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానేరు వాగులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి

28-01-2026 11:38:20 PM

కాపాడిన డిస్ట్రిక్ట్ గార్డ్ 

కానిస్టేబుల్స్ గంగరాజు, అనిల్

రాజన్న సిరిసిల్ల, జనవరి 28 (విజయక్రాంతి): జిల్లాలో తంగలపల్లి గ్రామానికి చెందిన సుర నవీన్ వయస్సు: 27 అనే వ్యక్తి ఈరోజు సాయంత్రం తంగలపల్లి బ్రిడ్జి వద్ద మానేరు వాగులోకి దూకి ఆత్మహత్యకు ప్ర యత్నించాడు.ఆ సమయంలో విధి నిర్వహణలో భాగంగా అటువైపు వెళ్తున్న డిస్ట్రిక్ట్ గా ర్డ్ కానిస్టేబుల్స్ గంగరాజు, అనిల్ వెంటనే స్పందించి వాగులోకి దూకి ఆ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సమాచా రం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి ఆ వ్యక్తితో మాట్లాడి కౌన్సెలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు సమాచా రం అందించారు.వెంటనే స్పందించి ప్రాణాపాయం లెక్కచేయకుండా వ్యక్తిని రక్షించిన డిస్ట్రిక్ట్ గార్డ్ కానిస్టేబుల్స్ గంగరాజు, అనిల్ల ను ఎస్పీ మహేష్ బి. గితే అభినందించారు.