calender_icon.png 29 January, 2026 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గద్దెకు చేరుకున్న సారలమ్మ

29-01-2026 12:00:00 AM

భీమదేవరపల్లి, జనవరి 28 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సారాలమ్మ గద్దెకు చేరుకుంది. మేళ తాళాలతో ముల్కనూర్ గ్రామంలో ప్రత్యేకంగా సమ్మక్క సారలమ్మ వన దేవతల కోసం ఏర్పాటు చేసిన గది నుండి కురుమల డోలు తప్పులు భారీ ఎత్తున బాణసంచా పేలుస్తూ మేడారం నుండి వచ్చిన కోయ పూజారుల తో సారాలమ్మ గద్దెకు చేరుకుంది.

బుధవారం ఉదయం నుండి సమ్మక్క సారలమ్మ గుడి వద్ద భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల కొరకు ప్రత్యేకంగా వైద్య శిబిరం, మంచినీటి వసతి ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, సమ్మక్క సారలమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ జక్కుల ఐలయ్య,, ఆలయ డైరెక్టర్ మాలోత్ మొగిలి, గీకురు ఐలయ్య, మాడుగుల యాదగిరి, గుడికందుల రాజు,, కొదురుపాక శ్రీనివాస్ ,ఎలుక పెళ్లి రామారావు తెలిపారు.

నేడు సమ్మక్క గద్దెకు వచ్చుట, 30న మొక్కుబడులు చెల్లించుట 31న వనదేవతల వన ప్రవేశంతో సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు ముగుస్తాయి. బుధవారం రాత్రి జరిగిన సారాలమ్మ గద్దెకు చేర్చిన వారిలో ఊస కోయిల ప్రకాష్ జక్కుల మల్లికార్జున్, జక్కుల అనిల్ తో పాటు ముల్కనూర్ ఈవో జంగం పూర్ణ చందర్ తోపాటు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.