29-01-2026 12:00:00 AM
ముగిసిన ఐద్వా జాతీయ మహాసభలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 28 (విజయక్రాంతి): ‘హక్కులిస్తే గౌరవంగా తీసుకుంటాం. లేదంటే పోరాడి లాక్కుం టాం’ అని అఖిల భారత ప్రజాతంత్ర మహి ళా సంఘం ఐద్వా నూతన జాతీయ ప్రధాన కార్యదర్శి కనినిక ఘోష్ బోస్ స్పష్టం చేశారు. హైదరాబాద్ వేదికగా నాలుగు రోజుల పాటు జరిగిన ఐద్వా 14వ జాతీయ మహాసభలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా నూతన జాతీయ కమిటీని ప్రకటించారు.
అధ్యక్షురాలిగా పికె (కేరళ) మళ్లీ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కనినిక ఘోష్ బోస్ (పశ్చిమ బెంగాల్), కోశాధికారిగా తపసి ప్రహరాజ్ ఎన్నికయ్యారు. మీడి యా సమావేశంలో కనినిక ఘోష్ బోస్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం అదానీ, అంబానీల కోసమే పనిచేస్తోందని విమర్శించారు. జాతీయ అధ్యక్షురాలు పికె శ్రీమతి మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు మెరుగైన జీవితాన్ని అందించాలంటే నేటి మహిళలు ఉద్యమించక తప్పదన్నారు.
దేశంలో మహిళలపై మనువాద దాడులు పెరుగుతున్నాయని ఐద్వా మాజీ ప్రధాన కార్యదర్శి మరియం దావలే ఆందోళన వ్యక్తం చేశారు. మహాసభల విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. ఈ మహాసభల్లో పలు అంశాలపై లోతైన చర్చలు జరిగాయి.