calender_icon.png 23 February, 2026 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విషం చిమ్మిన కల్తీ పాలు.. ఐదుగురు మృతి

23-02-2026 11:44:59 AM

అమరావతి: రాజమండ్రిలో(Rajahmundry) కల్తీ పాల ఘటనలో ఐదుగురు మృతి చెందారు. రెండు రోజుల వ్యవధిలో ఐదుగురు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కల్తీపాలు తాగిన బాధితులు అనూరియా సమస్యతో(Anuria) బారినపడ్డారు. కల్తీపాల ఘటనలో వేర్వేరు కుటుంబాలకు చెందిన వారు చనిపోయినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న ఇద్దరు, ఇవాళ ముగ్గురు ప్రాణాలు విడిచారు. కల్తీ పాలు(Adulterated Milk) తాగిన కొందరు బాధితులు కిడ్నీ సమస్యలతో(Kidney problems) బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు. కలుషిత పాలు తాగిన బాధితులు అస్వస్థతకు గురైన ఆస్పత్రిలో చేరారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారలు రాజమహేంద్రవరంలో(Rajamahendravaram) పాలు, నీరు, నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపారు. కల్తీ పాల ఘటనలో పాల వ్యాపారి గణేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ పాలతో ఒక్కసారిగా డయేరియా, మూత్రపిండాల కేసులు  వెలుగులోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.