20 June, 2026 | 1:33 PM

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

18-06-2026 01:02 PM

తాండూరు, జూన్ 18, (విజయ క్రాంతి): అనారోగ్యం బాధలకు ఆర్థిక ఇబ్బందులు తోడై జీవితం పై విరక్తి చెందిన ఓ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే సిబ్బంది వీరేష్ తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం మాణిక్ నగర్ కు చెందిన రాము గత కొన్ని రోజులుగా లివర్ కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం చేసిన అప్పులు అధికమై జీవితంపై విరక్తి చెంది గురువారం తెల్లవారుజాము మూడు గంటల సమయంలో రైల్వే స్టేషన్ యార్డ్ లో గల ట్రాక్పై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు