14 July, 2026 | 7:28 PM

Breaking News

వేంసూరు గ్రామంలో ఏఎంసీ చైర్మన్ శ్రీ దోమ ఆనంద్ బాబు జన్మదిన వేడుకలు   •   శ్రీనిధి రుణాల రికవరీని వేగవంతం చేయండి   •   300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న కల్హేర్ పోలీసులు   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   ఇంటింటి సర్వైతో ఖచ్చితమైన ఓటరు జాబితా   •   ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •  

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

28-04-2025 12:56 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఏప్రిల్ 27: ఉరివేసుకుని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది.స్థానిక ఎస్త్స్ర బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా గాంధీనగర్ కు చెందిన జక్కలి జనార్దన్(30) జాజిరెడ్డిగూడెం మండలంలోని కొమ్మాల గ్రామానికి చెందిన నవ్యను 9 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.

ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు.ఉగాది పండుగ సందర్భంగా నవ్య తన ఇద్దరు కూతుర్లతో కలిసి తల్లిగారి ఊరైన కొమ్మాలకు వచ్చి అక్కడే ఉండిపోయింది.గత మూడు రోజుల క్రితం భర్త జనార్ధన్ కొమ్మాల గ్రామానికి వెళ్ళాడు.

నివారం రాత్రి భార్యతో గొడవ జరగగా ఇంట్లోని బెడ్ షీట్ తీసుకొని బయట నిద్రిస్తానని చెప్పి వెళ్ళాడు.ఆదివారం తెల్లవారుజామున గ్రామ శివారులోని వ్యవసాయ భూమి వద్ద గల రేకుల షెడ్డులో ఉరివేసుకొని మృతి చెందాడు.మృతిని తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర బాలకృష్ణ తెలిపారు.