14 July, 2026 | 6:57 PM

Breaking News

విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •  

శ్రీ రామ కొండంత భక్తజనం

28-04-2025 12:55 AM

అమావాస్యతో శ్రీరాముడి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు 

కోయిల్ కొండ ఏప్రిల్ 27 :  కోయిలకొండ మండలం పరిధిలో కొలువుతీరిన శ్రీరామ కొండకు భక్తులు ఆదివారం అమావాస్య కావడంతో పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీరాముడు దర్శనం కోసం భక్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వేలాదిమంది కుటుంబ సభ్యులతో కొండపైకి ఎక్కి శ్రీరాముడిని దర్శించుకున్నారు.

భక్తులతో పాటుగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ శ్రీరాముడిని దర్శించుకున్నారు. వేలాది మంది భక్తులు వస్తారని సమాచారం ముందస్తుగా ఆలయ కమిటీ సభ్యులకు ఉండడంతో అధికారులు వేసవి తాపాన్ని తట్టుకునేలా నీడ ఉండేలా ఏర్పాటు చేశారు. దీంతో భక్తులకు కొంత మేరకు ఉపశమనం కలిగింది.

ఆదివారం అమావాస్య రావడంతో కోయిలకొండ మండల పరిధిలోని శ్రీరామ కొండకు భక్తులు విచ్చేసి కొండపై ఉన్న ఆకులు తీసుకుని ఇంట్లో ఉంచుకుంటే మంచిదని నానాటి నుంచి భక్తులు విశ్వసిస్తుంటారు. దీంతో ఆదివారం అమావాస్య వచ్చిందంటే చాలు భక్తులు శ్రీరామ కొండకు వేలాదిగా తరలివచ్చడం ఆచారంగా మారింది. కొండపై కొలువుతీరిన శ్రీరాముడిని భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.