28-04-2025 12:57:16 AM
మెదక్, ఏప్రిల్ 27(విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రమూకల దాడికి నిరసనగా ఆదివారం నాడు మెద క్ సీఎస్‌ఐ క్యాథడ్రల్ చర్చిలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. చర్చి ఫాస్టర్ శాంతయ్య నేతృత్వంలో కొవ్వొత్తులు వెలిగించి ఉగ్ర దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రిచరడ్స్, జైపాల్, శ్రీనివాస్, కమిటీ సభ్యులు శ్యాంసన్ సందీప్, గంట సంపత్, ఫ్రాంక్ జాన్సన్, సువన్ డగ్లస్, గెలిన్ చిత్తరంజన్, జాయ్ముర్రే, సుశీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.