15 April, 2026 | 12:35 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

04-02-2026 12:22 AM

కొల్చారం (విజయక్రాంతి): అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి లో జరిగింది. మృతుని భార్య ఎల్లాపురం ప్రమీల తతన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎల్లాపురం వెంకటేశం  (50) పులి పని చేస్తూ జీవించేవాడు. గత కొన్ని రోజులుగా దుర్వ్యసనాలకు తాగుడుకు బానిసైన వెంకటేశం పనికి వెళ్లకుండా మద్యం తాగుతూ ఉండడంతో అప్పుల పాలయ్యాడు.

దీంతో కొన్ని రోజుల క్రితం ఉపాధి నిమిత్తం సూరారం ప్రాంతానికి తన భార్య ప్రమీల తో కలిసి వెళ్ళాడు. గత నెల 25వ తేదీన సూరారం నుండి పోదంశెట్టిపల్లి వెళ్లి వస్తానని వచ్చిన వెంకటేశం గత వారం రోజులుగా గ్రామంలోని ఉన్నాడు. మంగళవారం సాయంత్రం సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకొని మృతి చెందాడు. మృతుని భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్‌ఐ మహ్మద్ మోహినుద్దీన్ కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం శవాన్ని మీద జిల్లా ఆసుపత్రికి తరలించారు.