calender_icon.png 4 February, 2026 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రశాంతంగా నిర్వహించాలి

04-02-2026 12:20:12 AM

కలెక్టర్ రాహుల్ రాజ్

కొల్చారం (విజయక్రాంతి): ఇంటర్ ప్రాక్టికల్స్ను ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇంటర్ విద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం కొల్చారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ ప్రాక్టికల్స్ను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు.ల్యాబ్ రూములు, ల్యాబ్ మెటీరియల్ను తనిఖీ చేసిన కలెక్టర్, ప్రాక్టికల్స్ నిర్వహణ విధానంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థుల రికార్డులు, సీసీ కెమెరాల పనితీరును కూడా పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ, ఇంటర్ విద్యార్థులు ప్రాక్టికల్స్ను ఆందోళన లేకుండా పూర్తి చేసుకోవాలని, ఆరట్స్ గ్రూప్ విద్యార్థులు ప్రత్యేక తరగతులను తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. ఈ నెల 10వ తేదీ వరకు జరగనున్న ప్రాక్టికల్స్ ప్రశాంతంగా నిర్వహించేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్యాధికారి మాధవి, చీఫ్ సూపర్డెంట్ నవీన్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.