17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మెదక్ బీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీ ఫాంల అందజేత

04-02-2026 12:23 AM

మున్సిపల్ ఎన్నికల ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ 

మెదక్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 31 వార్డులకు బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. మంగళవారం మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ పార్టీ అభ్యర్థుల తరపున అధికారులకు బీఫాంలను మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని కులాలకు ప్రాధాన్యతనిస్తూ టిక్కెట్లు కేటాయించినట్లు వివరించారు.

మున్నూరు కాపు , ముస్లింలకు 4, ముదిరాజ్, ఎస్సీ ( మాదిగ) లకు 3, లింగాయత్, గౌడ్స్ , వంజరి కులస్తులకు 2 చొప్పున టికెట్లు కేటాయించినట్లు తెలిపారు. వీరితోపాటు ఎస్సీ (మాల), పూసల, యాదవ్, బుడగ జంగం, ఎరుకల, ఆర్య క్షత్రియ, కుంచెఎరుకల, క్రిస్టియన్, చాకలి, పద్మశాలి, మేర కులస్తులకు ఒకటి చొప్పున టికెట్టు బి ఫామ్ లు అందజేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి,మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి తదితరులు ఉన్నారు.