గుండెదడ!

05-10-2026 | 05:10am

నిజమే - భయపడ్డాను.. ఘోరంగా భయపడి పోయాను. ఇప్పుడూ భయపడుతూనే వున్నాను. అయితేమా త్రం, పిచ్చి వాడని ఎందుకంటారు అంటా నన్ను!. భూమ్మిదివీ, ఆకాశంవిదివీ అన్నీ నేను విన్నాను. నరకంలోవి కూడా ఎన్నో విన్నాను. అలాంటపుడు పిచ్చివాడిలా అ య్యాను అంట! బాగా గమనించండి, ఎం త నెమ్మదిగా చెప్తానో, జరిగిన కథంతా నా బుర్రలో ఎలా దూరిందో..

ఆ ముసిలాణ్ణి ప్రేమించేవాణ్ణి. అతడూ ఎన్నడూ హానీ చెయ్యలేదు నాకు. ఎన్నడూ అవమానించలేదు. అతడి డబ్బు కోసంకూ డా ఆశ పళ్ళేదు నేను. దీనంతటికీ అతడి కన్నే అనుకుంటాను కారణం. అవును, అదే. అతడి ఒక కన్ను రాంబందు కన్నులా వుండేది. నీలిగా పాలిపోయీ వుండేదది. ఆ కన్ను నా మీద పడ్డప్పుడల్లా నా రక్తం గడ్డకట్టుకునేది. అతణ్ణి చంపెయ్యాలని, చం పేసి ఆ కంటి నుండి ఏకంగా -తప్పించుకోవాలని.

అతణ్ణి చంపేముందు, ఆ వారం రోజులూ ఆముసిలాడిమీద ఎంత దయగా వున్నానంటే, అలా ఎప్పుడూ ప్రవర్తించలేదు నేను. ప్రతీ రాత్రి సరిగ్గా నిశిరాత్రి వేళ గడియ తిప్పి అతడి గది తలుపు మెల్లిగా, తెరిచే వాణ్ణి. సరిగ్గా నా తల దూరేటంత మాత్రం తెరిచి, ఒక చీకటి లాంతరు, అంటే ఎక్కడా కనపడకుండా, పిసరంత వెలుతురూ పైకిరాకుండా బాగా కప్పేసిన లాం తరు పట్టుకుని, గదిలో తల దూర్చేవాణ్ణి.  ముసిలాడికి మెళుకువ రాకుండా మెల్లిగా, సడీ చప్పుడూ లేకుండా తల దూర్చేవాణ్ణి.

తలంతా లోపల దూర్చేసరికి సరిగ్గా ఒక గంట పట్టేది నాకు. ఏమంటే, తలంతా లో పలికి వెళ్ళకపోతే... పక్కమీద ముసిలాణ్ణి బాగా చూడలేను కదూ! నాతల -పూర్తిగా గదిలో ప్రవేశపెట్టాక, జాగ్రత్తగా, బహుజాగ్రత్తగా కీళ్ళన్నా కదలకుండా లాంతరు విప్పేవాణ్ణి. కేవలం ఒక సన్నని కిరణం వెలుగు మాత్రం బైటికి వచ్చి, ముసిలాడి రాబందు కంటిమీద మాత్రం పడేట్టు, స్వ ల్పంగా, బహు స్వల్పంగా తెరిచేవాణ్ణి. ఇలా ఏడు రాత్రుళ్లు. ప్రతీ రాత్రి సరిగ్గా రెండు జాములపుడు చేసేవాణ్ణి. ప్రతీసారీ ఆ రాంబందు కన్ను మూసే వుండేది. అంచే త, అనుకున్న పని చెయ్యడం అసాధ్యమైపోయేది నాకు. 

నన్ను బాధ పెట్టింది ముసి లాడి కన్ను కాని, ముసిలాడు కాడు కదా! ఆ కంటిని వొదిలించుకోవాలని కదా, నా సంకల్పం! పతిరోజూ తెల్లవారాక సాహసించి ముసిలాడిదగ్గరికి వెళ్ళేవాణ్ణి. అతణ్ణి పేరు పెట్టి పిలిచేవాణ్ణి. కలిసి మెలిసీ మాట్లాడేవాణ్ణి. ఇంతయాక, నన్ను అతడు సందేహించడానికి -- రోజూ రాత్రి పన్నెండప్పుడు అతడు నిద్రలో వుండగా, అతడి గదిలో దూరి అత ణ్ణి చూస్తూ వున్నానని అనుకోవడానికి, --ముసిలాడు మహా లోతుగుండె వాడు కా వాలి.

ఎనిమిదోనాడు తలుపు తెరవడంలో మరింత జాగ్రత్తగా వున్నాను. ఒక వాచీ పెద్దముల్లయినా నాకంటే వేగం నడుస్తుం ది. అంత మెల్లిగా అడుగులు వేశాను. నా విజయం మీద నాకు గర్వం కలిగిపోయిందంటే నమ్మండి. ఆ సంతోషంలో నవ్వేశా ను నేను. అతడు అది విన్నాడో ఏమో ! హటాత్తుగా వులికిపడ్డట్టు పక్కమీద లేచాడు. నేను వెనక్కి వచ్చేశా ననుకుంటా రేమో అబ్బే లేదు. అతడి గది కాటుక ముద్దలాగ, చిమ్మచీకట్లతో వుంది.

(దొంగలకి భయపడి కిటికీన్నీ బిగించే పడుకుంటా డతడు.) అంచేత, నాకు తెలుసు, నేను తలుపు తెరవడం అతడికి సుతారామూ కనపడదు. మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం తలుపు తెరుస్తూనే వున్నాను. లోపల తల దూర్చాను. నా చీకటిలాంతరు తెరవడానికి సర్దుకుంటున్నాను. లాంతరు రేకుమీద నా వేలు తగిలింది. ’ఎవరదీ?’ - దభీముని పక్కమీద లేచి, కేక వేశాడు.

నేను మాటాడకుండా నిలబడిపోయా ను. పిసరంత కంటి మీద రెప్పయినా కదిలే కొట్టు. ఒక గంటదాకా అలా వుండి పో యాను. అంతసేపూ అతడు పక్క మీద వాలినట్టు సడి కాలేదు. కనిపెడుతూ పక్క మీద కూచునే వున్నాడు. కొంచేపయాక, వొక చిన్న మూలుగు విన్నాను. నాకు తెలు సు మృత్యుభయంతో వచ్చే శబ్దం. బాధ వల్ల కానీ, దుఃఖంవల్ల కానీ వచ్చిన మూలు గు కాదది. ముసిలాడు ఎలా భయపడుతున్నదీ నాకు తెలుసు.

అతడిమీద జాలి వేస్తు న్నా, నవ్వేవస్తోంది నాకు. నాకు తెలుసు, మొట్టమొదట నవ్వు విన్నప్పటినించీ, పక్కమీద మేలుకునే వున్నాడుడు ముసిలాడు. అప్పటినుంచీ అతడిలో భయం పెరుగుతూనే వచ్చింది. భయానికి కారణం ఏమీ లేదని, తన్ను తాను సముదాయించుకోవాలని చూశాడు. కానీ సాధ్యంకాలేదు. 

’ఏమీ లేదు. గాలి చిమ్ని నికదిలించి వుంటుంది- లేదా ఎలకో ఏదో కింద పరుగెత్తి, వుంటుంది. పురుగు, చింతగీరు వో సారి అరిచి వూరుకుని వుంటుంది. సరిపెట్టుకుని వుంటాడు. అవును, ఇలాభావించు కుని తన్ను తాను నచ్చజెప్పు కోవాలనుకున్నాడు. కాని అవన్నీ వ్యర్థమై పోయాయి. ఏమంటారా, చావు అతడి దగ్గరికే వచ్చేసింది. తన వల్లటినీడ ముసిలాడి చుట్టూ పరిచేసి, అందులో అతణ్ణి చుట్టబెట్టేపింది.

చూడక పోయినా వినక పోయినా నాతల తఃగదిలో వుండని సందేహించడానికి కన పడని ఆమృత్యువు నీరే కారణం, ఏదో - అని ధైర్యంగా అలా ఎంతో సేపు నేను నుం చున్నప్పటికీ ముసలోడు పడుకోలేదు. చూపి దూసి, తునికి లాంతరు కొంచెం బహు కొంచెమే, తెరవాలనిపించింది నాకు తెరిచానుకూడా.  మీరు ఊహించనయినా ఊహించలేరు, ఎలా, ఎంత మెల్లి గా, ఎంత జాగ్రత్తగా చిన్న రంధ్రం అవుపించినట్టు, వొకే వొక్క కిరణం వెలుగు బైటి కివచ్చినట్టు తెరిచానో లాంతరు. పురుగు దారం లాంటి సన్నటి వెలుగు అంతర్లోంచి బైటికి వెళ్ళి ముసిలాడిమీద పడింది. స రిగ్గా ఆవెలుగు వెళ్ళి ముసలాడి మీద పడింది.

ముసిలాడి రాంబందు కంటి తెరిచేవుంది కన్ను. బాగా పెద్దదిగా తెరిచి వుంది. స్పష్టంగా కనిపిస్తోంది కన్ను. పాలిపోయీ, నీలిగా, మనక తెరతో అసహ్యంగా వుందది.  ఆ కన్ను తప్పించి, ముసిలాడు కాని, అతడి మొహంకాని నాకు కనపల్లేదు. దైవ వశాత్తూ సరిగ్గా ఆ పిశాచికన్ను మీదే గురిపెట్టాను వెలుగు. సరిగ్గా అప్పుడు సన్ననిదొక శబ్దం, చప్పున వచ్చి నా చెవిలో పడింది. వాచీ దూదిలో చుట్టేస్తే ఎలా వినిపిస్తుంది, అదిగో వుంది ఆశబ్దం. ఆశబ్ద మూ బాగా నే తెలుసు నాకు. అది అది ముసిలాడి గుండె దడ. అది వినండంతో నే నాక్రోధం మరింత రెచ్చిపోయింది, రణభేరీ వింటే సైనికుడి సాహనం ఎలా ఉద్రేకిస్తుందో అలాగే.

అప్పటికీ నన్ను నేను అపుకుని, కదలకుండా అలాగే నుంచున్నాను. ఊరున్నా విడిచిపెడితే వొట్టు. కంటిమీదే వెలుగు గురిపెట్టి వుంచాను. ఇంతలో ముసిలాడి’ పాడు గుండెదడ క్షణక్షణం అది అధిక హెచ్చిపోవడం మొదలయింది. ఆనిశిరాత్రిలో, ఆపాత ఇంట్లో, ఆనిశ్శబ్దంలో ఈ చిత్రమయిన శబ్దం భరించలేవంటే భ యంతో మతిపోయింది నాకు. అయినా, కొద్ది నిమిషాలపాటు కదలకుండా అలాగే నిలబడ్డాను. ఈ దడ ఇరుగుపొరుగు వాళ్ళు వింటేనో ! పెందలాడే ఘడియలు నిండిపోయాయి! అతడి పెద్ద పరుపు లాగే సి అతడిమీద దబాయించి కప్పేశాను. ఇంతవరకూ సాధించాక, చిన్న చిరునవ్వు నవ్వాను.

కొంత సేపుదాకా అతడి గుండెదడ వినిపిస్తూ సేవుండి, మెల్లి మెల్లిగా. అయితే అదేమీ నన్ను చికాకు పెట్టలేదు. ఏమంటారా ఆ చప్పుడు నాలుగు గోడలూ దాటి బైటికి వెళ్ళదు. చివరికి ఆగిపోయింది చప్పుడు. ముసిలాడు చచ్చిపోయాడు. శ వం జాగ్రత్తగా పరీక్షించాను. అవును, చచ్చిపోయాడు ముసిలాడు. కర్రలాగ. గుండెల మీద చెయ్యి వేశాను. ఎంతో సేపు అలా వుంచి చూశాను. ఉహూఁ. దడలేదు. చచ్చి పోయాడు. కొయ్యబారిపోయాడు. 

హమ్మయ్యా, అతడి కన్ను మరి ఎన్న డూ బాధ పెట్టదు నన్ను. ఏం, ఇంకా నన్ను పిచ్చివాడనుకుంటున్నారా ? అయితే, ము సిలాడీ కళేబరం దాచెయ్యడంలో నేనెంత తెలివి తేటలు చూపించానో, వినండి. రాత్రి అయిపోవస్తోంది. త్వరత్వరగా పని చేశాను, విసరంత చప్పుడు చెయ్యకండా చేశాను. మొట్ట మొదట ముసిలాడి కళేబరం ముక్క ముక్కలు చేసేశాను. కాళ్ళూ, చేతులూ నరికేశాను. తలా, తరవాత గదిలోని కిందిపలకలు మూడు తినేశాను. శవం ముక్కలు కింద పాతేశాను. విసరంత తేడాలేకుండా ఎప్పటి లాగే మళ్ళీ పలకలు పెట్టేశాను. ఎంత చాకచక్యంగా, ఎంత చమత్కారంగా ఆపలకలు వేర్చేశానంటే, మానవమాత్రుడు కనిపెట్టలేడది. 

చిన్న రక్తం మరకయినా ఎక్కడా పడలేదు. నేను ముందే జాగ్రత్త పడ్డాను. అంత పనీ ఒక టబ్బులో చేశాను. ఇదంతా పూర్తిచేసేసరికి నాలుగయింది. అయినా అద్ద రాత్రిలా వుంది చీకటి. గంటలు నాలుగూ కొడుతున్నాయి. వీధిలో ఎవరో తలుపుతట్టిన చప్పుడయింది. జంకూ కొంకూ రేగం డా వెళ్ళి తలుపుతీశాను. భయపడడానికి ఏముందని ఇక ! తెలుపు తియ్యగానే, ము గ్గురు మనుష్యులు లోపల ప్రవేశం. పోలీ సు ఆఫీసర్లు వాళ్ళు.

పొరుగింటాయన రాత్రి కేకలు కని, ఏదో జరిగిందని సందేహించి, పోలీసుస్టేషనులో రిపోర్టు చేశాడు. అందుకని ఇల్లు సోదా చెయ్యడం కోసం ఇలా వచ్చారు. నవ్వాను నేను.. - భయం దేనికని! దయ చెయ్యండని లోపలికి పిలిచాను వాళ్ళని. నేనే, కల్లో అలా కేకలు వేళా కున్నాను. ఊసినాయన వూళ్ళో లేడన్నాను. ఆ గదిలోనే కొంచెం కుర్చీలు వేశా ను. సంపూర్ణ మయిన విజ గొప్పురి నాకు, నేనూ వొక కుర్చీ లాక్కున్నాను. సరిగ్గా ముసిలాడి కళేబరం పాతిపెట్టిన పలకల మీదే వేసుకుని, కూచున్నాను. పోలీసు వాళ్ళ సందేహం తొలిగిపోయింది. తృప్తిపడ్డారు. ఏ అనుమానమూ లేదిక. నా ప్రవ ర్తనమీద వాళ్ళకి నమ్మకం కుదిరిపోయిం ది.

వాళ్ళు ఏవేవో అవీ ఇవీ అడిగారు. ఉ సారుగా జవాబు చెప్పాను. ఇంతలో నేనే దో వెర్రిమొహం వేస్తున్నట్టు అనిపించింది నాకు. వాళ్ళు వెళ్ళిపోతే బావుండు ననిపించింది. నాతల పోటు పెట్ట డం మొదల యింది. చెవుల్లో హోరు ప్రారంభమైంది. ఇంకా వాళ్ళు కూచునేవున్నారు. ఇంకా బా తాఖానీ కొడుతూనే వున్నారు. నా చెవుల్లో హోరు మరింత స్పష్టంగా వినిపిస్తోంది. మరింత, మరింత హెచ్చిపోతూ వుంది. అది తప్పించుకోవాలని నేను మరింత స్వేచ్ఛగా మాట్లాడడం మొదలెట్టాను. కాని లాభం లేకపోయింది. మరింత హెచ్చి పోయిందది. 

ఏవిటి సాధనం! ఏదో లోపలనుండి నన్నంగా, గబగళా వస్తున్నట్టుంది ఆ ధ్వని. వాచీ దూదిలో చుట్టేస్తే ఎలా వినిపిస్తుంది, అదిగో సరిగ్గా అలాగేవుంది. ఊపిరాడలేదు నాకు. ఐతే, పోలీసు వాళ్ళు మాత్రం అది వినడంలేదు. నేను మరింత జోరుగా మాట్లాడేస్తున్నాను మాంచి ఉద్రేకంతో మాట్లాడేస్తున్నాను. కాని ఆధ్వని మాత్రం తగ్గలేదు. హెచ్చిపోతూనే వుంది. నేను నిలబడ్డాను. గాట్టిగా ఏవేవో వాదించాను.

అడ్డూ అదుపూ లేకుండా ఏవేవో మాట్లాడేస్తున్నాను. కాళ్లూ, చేతులూ ఝాడిస్తూ, అరుస్తూ మాట్లాడేస్తున్నాను. అయినా ఆ చప్పుడు తగ్గలేదు. హెచ్చిపోతూనే వుంది. వీళ్ళు పోరేం! వాళ్ళని చూసి చిరాకుపడుతున్నట్టు పెద్ద పెద్ద అంగలు వేస్తూ గదిలో పచారు ప్రారంభించాను. కాని ఆ చప్పుడు తగ్గలేదు.  ఆ ధ్వని వీళ్ళు వినడం లేదూ! ఇది నమ్మదగిందేనా? 

ఈ భావం నా బుర్రలో దూరింది. ఈ బాధకంటే ఏ శిక్షయినా నయం. ఈ వెక్కిరింపుకంటే ఇంకా ఏదయినా మేలే. ఈ దొంగ వెధవనవ్వులు మాత్రం మరి సహించలేను. గట్టిగా అరుద్దామనిపించింది. చచ్చిపోదామనిపించింది. - కాని - అదిగో మళ్ళీ వినండి వినండి. అదే ధ్వని. గట్టిగా, గట్టిగా.. వెధవల్లారా ! ‘ అరిచాను. ఈ దొంగ వేషాలు వెయ్యకండి మరి! చేసినపని వొప్పేనుకుంటున్నాను ! ఈ పలకలు వూడదియ్యండి ! ఇక్కడ, ఇక్కడ ! చప్పుడవుతోంది, పాడు గుండె దడ ! 


మరిన్ని వార్తలు