calender_icon.png 14 January, 2026 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండగపూట విషాదం

14-01-2026 11:19:02 AM

అల్లుడు మృతి మామకు తీవ్ర గాయాలు

 బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని  కుంటల మాలపల్లి అందుగులగూడ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఒర్రె పై నుండి పడడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ద్విచక్ర వాహనం అదుపుతప్పి వంతెన పైనుండి పడిపోవడంతో కౌటాల మండలంలోని చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బేజ్జూర్ మండలంలోని బోర్ కుట్ శంకర్ కు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఇట్టి విషయం పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదుచేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.