13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ బరిలో గాజుల రాజేశ్వర్?

14-01-2026 11:21 AM

గత 20 సంవత్సరాలుగా ప్రజాసేవ,సామాజిక సేవ కార్యక్రమాలు...

అందరివాడు లాగా ప్రజలతో మమేకం...

పార్టీ అవకాశం ఇస్తే మున్సిపల్ చైర్మన్ బరిలో నిలబడతా...

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ బరిలో బాన్సువాడకు చెందిన గాజుల రాజేశ్వర్ ఉంటున్నట్లు  తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూ అటు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ వ్యాపారం చేసుకుంటూ ప్రజల మన్నలను పొందిన వ్యక్తిగా రాజేశ్వర్ ఉన్నారు. అందరివాడు లాగా ప్రజలతో మమేకమై ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజాసేవకే తన జీవితం అంకితమని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున అవకాశం ఇస్తే తాను చైర్మన్ బరిలో నిలబడతానని అన్నారు. అదేవిధంగా ప్రజలకు సేవ చేసుకునే మరింత అవకాశం దొరుకుతుందని ఇలాంటి అవకాశం మళ్లీ రాదని పెద్దలు అవకాశం ఇవ్వాలని ప్రజల కోరిక మేరకు చైర్మన్ బరిలో ఉంటున్నానని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు పాల్గొనడం జరిగిందన్నారు. ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే ప్రజలకు సేవ చేస్తానని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు.