25-05-2025 08:48:02 PM
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ లోని డిస్నీల్యాండ్ ఈ - టెక్నో హై స్కూల్(Disneyland E-Techno High School)లో ఐదో తరగతి చదువుతున్న గుగులోతు కృతిక ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ సీటు సాధించింది. ఇటీవల నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆరో తరగతిలో ప్రవేశానికి కృతిక సీటు సంపాదించడం పట్ల పాఠశాల వ్యవస్థాపకులు దయ్యాల మల్లయ్య, దయ్యాల సదయ్య, బాలుగు లక్ష్మీనివాస్, డైరెక్టర్లు బాలుగు శోభారాణి, దయ్యాల రాకేశ్, భాను, దయ్యాల దినేష్ చందర్ అభినందించారు. పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు.