14 July, 2026 | 4:42 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

15-05-2026 12:39 AM

ధర్మపురి,మే14(విజయక్రాంతి):ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామశివారులో బుధవారం అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వాహనం డీకొట్టి వ్యక్తి మృతి చెందాడు.మృతుడు సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన పరశురామ్ మృతుడు ఎరవెల్లి పరశురాం(43) గా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ వెంకట్ రెడ్డి, ధర్మపురి సీఐ రాం నర్సింహా రెడ్డి పరిశీలించారు. మొదట హత్యగా భావించిన పోలీసులు క్లూస్ టీమ్ ఆధారంగా ప్రమాదం జరిగే మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఎస్త్స్ర పి ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు పరశురామ్ తన యొక్క కారును రోడ్డు పక్కన పార్క్ చేసి రోడ్డు దాటే క్రమంలో ఎదో గుర్తు తెలియని వాహనం టక్కరి ఇచ్చిందనీ,మృతునికి బలమైన రక్త గాయాలు అయ్యాయని తెలిపారు.

ఇట్టి ప్రమాదంలో మృతుడు సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి ఒక కొడుకు,ఇద్దరు కూతుల్లు సంతానం కాగా, మృతుని భార్య గత నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయినట్లు వెల్లడించారు. మృతుని తల్లి ఎరవెల్లి లింగవ్వ ఇచ్చిన దరఖాస్తు పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన్నట్లు ఎస్త్స్ర పి. ఉదయ్ కుమార్ తెలిపారు.