గర్వించదగ్గ ఫొటో జర్నలిస్ట్ రఘు రాయ్
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి
ముషీరాబాద్, మే 14 (విజయక్రాంతి): భారతదేశం గర్వించదగ్గ ఫోటో జర్నలిస్ట్ ‘రఘు రాయ్’ అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం (టి.ఎస్.పి.జె. ఏ) ఆధ్వర్యంలో గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ పద్మశ్రీ రఘు రాయ్ సంస్మరణ సభను నిర్వహించారు.
టీఎస్‌పీజేఏ అధ్యక్షులు అనుమల్ల గంగాధర్ అధ్య క్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఐజెయు సెక్రటరీ జనరల్ సోమ సుందర్, ఐజెయు స్టీరింగ్ కమిటీ సభ్యులు కె.సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే అధ్యక్షులు కె. విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, ఉప ప్రధాన కార్యదర్శి కె.రా ములు, ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ డి.రవీందర్ రెడ్డి, టీఎస్‌పీజేఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నరహరి తదితరులు పాల్గొని ముందుగా పద్మశ్రీ రఘు రాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తన ఫోటోలతో భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప ఫోటో జర్నలిస్ట్ రఘురాయ్ అని కొనియాడారు. కల్చర్, లైఫ్, బంగ్లాదేశ్ యుద్ధం, భోపాల్ గ్యాస్, దలైలామా, మదర్ థెరెసా, ఇందిరాగాంధీ తదితర గొప్ప వ్యక్తుల ఫోటోలు రఘు రాయ్ కు గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీఎస్‌పీజేఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. కిషోర్ సింగ్, పి.రామ్మూర్తి, సంయుక్త కార్యదర్శి బీహెచ్‌ఎంకే గాంధీ, కోశాధికారి కె.అనిల్ కుమార్, కార్యవర్గ సభ్యులు పీ మోహనచారి, ఎండి. ఏలీముద్దీన్, జీ వసంత్ కుమా ర్, నక్క శ్రీనివాస్, ఏ మహేష్ కుమార్, పీ హరికృష్ణ, ఎన్ శివకుమార్ పాల్గొన్నారు.






