21 April, 2026 | 7:30 PM

అన్నం వండే పాత్రపై పడి వ్యక్తి మృతి

16-05-2025 12:00 AM

రాజేంద్రనగర్, మే 15: ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు అన్నం వండుతున్న పాత్ర పై పడిపోవడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి కథనం ప్రకారం.. శంషాబాద్ మండలంలోని చిన్న గోల్కొండ గ్రామానికి చెందిన గౌతం అంజయ్య (78) గత ఏప్రిల్ 30న రాత్రి 9:30 గంటలకు ఇంట్లో నడుచుకుంటూ వె ళ్తుండగా శరీరం సహకరించకపోవడంతో అన్నం వం డుతున్న పాత్రపై పడిపోవడం తో ఛాతి, ఎడమ చేతికి తీవ్ర గా యాలయ్యాయి. ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి బుధవారం రాత్రి చనిపో యాడు. మృతుడి కుమారుడు గౌత మ్ చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.