21 April, 2026 | 6:09 PM

కేవోసీ ఏఐటీయూసీ నూతన ఫిట్ కార్యదర్శిగా బానోత్ బాలాజీ ఏకగ్రీవ ఎన్నిక

16-05-2025 12:00 AM

టేకులపల్లి, మే 15 : టేకులపల్లి మండలంలోని స్థానిక ఎఐటియుసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకుని కెఓసి ఫిట్ కార్యదర్శి ఎన్నిక నిర్వహించారు. జనరల్ బాడి సమావేశంలో కెఓసి నూతన ఫిట్ కార్యదర్శిగా బానోత్ బాలాజీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా బ్రాంచ్ కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్ ప్రకటించారు.

పిట్ కార్యదర్శితొ పాటు పిట్ సహయ కార్యదర్శులుగా షెక్ సర్వర్, బి బాలు కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా గుగులొత్ కృష్ణ, ధల్ సింగ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. షిఫ్ట్ ఇం చార్జిలుగా జనరల్ షిఫ్ట్ ఇంచార్జి సామల శ్రీనివాస్, ‘ఎ‘ రిలే ఇంచార్జి మహ్మద్ సద్దాత్ హూసేన్, ‘బి‘ రిలే ఇంచార్జి మహ్మద్ షబ్బీర్, ‘సి‘ రిలె ఇంచార్జి బి అశోక్ కుమార్ లను ఎన్నుకున్నారు.

నూతన కమిటీని అనంతరం కెఓసి మేనేజర్ పేరాల శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిసి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికైన నూతన కమిటీకి మేనేజర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా బ్రాంచ్ కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్, నూతన కమిటికి సూచనలు చె సారు. భాద్యాతాయుతంగా పనిచేయాలని కార్మికుల సమస్యలపై నిత్యం స్పందించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలొ ఉమామహేశ్వరరావు, హతీరామ్, తదితరులు పాల్గొన్నారు.