13-11-2025 02:37:18 PM
తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ వెంకటాపూర్ గ్రామస్తుడు కుటుంబ కలహాలతో బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్(Brahmanpalli Railway Station) వద్ద రైలు పట్టాల మధ్యలో శివమై కనిపించాడు. మృతుడు అంగడి శంకర్ 52 కులం మాల, ఇతని భార్య అనిత 45, వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే బుధవారం మద్యం సేవించి ఇంట్లో అనితతో గొడవ పెట్టుకున్నాడు. అనంతరం తన అన్న మనుమరాలిని బిల్డింగ్ పై నుండి కిందికి ఎత్తివేయడం జరిగిందని ఆ పాపను తక్షణమే ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లామని తీరా చూస్తే ఘటన ఎదురైందని మృతుడి భార్య అనిత బోరున విలిపిస్తూ తెలిపింది. మృతుడు శంకర్ సమీపంలోని కల్లు దుకాణాలలో నిత్యం కల్లు సేవించేవాడని మద్యం మత్తులో ఏం చేస్తాడో అర్థం కాని పరిస్థితి ఉండేదని మానసిక పరిస్థితి సరిగా ఉండేది కాదని మృతుని భార్య తెలిపింది.