calender_icon.png 13 November, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల అవకతవకలు, భూ ఆక్రమణపై బీఆర్ఎస్ ధర్నా

13-11-2025 02:34:21 PM

బెల్లంపల్లి అర్బన్: బెల్లంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల అవినీతి, రోడ్డు విస్తరణ లో వ్యాపారుల నుంచి డబ్బుల వసూళ్లు, ప్రభుత్వ భూముల అక్రమణ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రోడ్డు విస్తరణలో విస్తాపకుల నుంచి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారనీ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని గులాబీ శ్రేణులు డిమాండ్ చేశారు. పట్టణంలో కన్నాల ఫ్లైఓవర్ శివారు ప్రభుత్వ భూములతో పాటు ఎక్కడ చూసినా భూ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. భూ అక్రమాలు, వ్యాపారుల నుంచి డబ్బుల వసూళ్ల వెనక అధికార పార్టీ లీడర్లే ఉన్నారని ఆరోపించారు. వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం టిఆర్ఎస్ ప్రతినిధులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నూనెటి సత్యనారాయణ, మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, నాయకులు మద్దెల గోపి, సబ్బని అరుణ్, కార్యకర్తలు పాల్గొన్నారు.