calender_icon.png 4 August, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

03-08-2025 11:37:00 PM

సూర్యాపేట,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానిక జాతీయ రహదారి పై ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాయినిగూడెం గ్రామానికి చెందిన గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి (50) ఐఎంఎ ఫంక్షన్ హల్ లో ఆదివారం రాత్రి సమీప బంధువు ఉద్యోగ విరమణ కార్యక్రమం లో హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న కారు వేగంగా ఢీ కొట్టిందన్నారు. దీంతో శ్రీనివాస్ రెడ్డికి తీవ్రగాయాలయ్యి అక్కడిక్కడే మృతి చెందాడన్నారు. వెంటనే పోలీసులు మృత దేహాన్ని స్థానిక జనరల్ ఆసుపత్రికి తరలించారన్నారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే ఇదే విషయంపై మృతుని కుటుంబ సభ్యులు రూరల్ పోలీస్ స్టేషన్ పిర్యాదు  చేసినట్లు తెలిపారు.