calender_icon.png 4 August, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీ కొమరారం పోలీసుల ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ

04-08-2025 12:00:00 AM

ఇల్లందు టౌన్, ఆగస్టు 3, (విజయక్రాంతి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  ఆదేశాల మేరకు గుండాల మండల పరిధిలోని శంబునిగూడెం,శెట్టిపల్లి గ్రామాలలోని  100 పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను రాబిన్ హుడ్ అనే స్వచ్చంద సంస్థ సహాయంతో ఆదివారం కొమరారం పోలీసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇల్లందు డిఎస్పీ చంద్రభాను పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలను సందర్శినప్పుడు కొంత మంది పేదవాళ్ళు కనీస కుటుంబ అవసరాలకు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని వారి వివరాలు సేకరించి స్వచ్చంద సంస్థల సహాయంతో బియ్యం, lకందిపప్పు,గోధుమపిండి వారికి అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆదివాసి ప్రజలు తమ పిల్లలను బాగా చదివించి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని కోరారు.

యువత గంజాయి,మద్యపానం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. కొంతమంది ప్రజలు వాహనాల డ్రైవింగ్ పై అవగాహన లేకుండా అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ మద్యం తాగి డ్రైవ్ చేయడం వలన రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారు.  వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని తెలిపినారు.  ఆదివాసి ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.

గతంలో కూడా మెడికల్ క్యాంపులు,దోమతెరలు పంపిణీ,దుప్పట్లు,సోలార్ లైట్లు,నిత్యవసర సరుకులు,యువతకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా శంభుని గూడెం,శెట్టిపల్లి గ్రామ ప్రజలు పోలీస్ శాఖకు ,రాబిన్ హుడ్ స్వచ్ఛంద సంస్థకు ధన్యవాదాలు తెలిపినారు.ఈ కార్యక్రమంలో గుండాల సీఐ రవీందర్, కొమరారం ఎస్త్స్ర నాగుల్ మీరా , గుండాల ఎస్త్స్ర సైదా రవూఫ్, పోలీస్ సిబ్బంది , రాబిన్ హుడ్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.