18 April, 2026 | 6:04 PM

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

03-06-2025 12:40 AM

పాపన్నపేట జూన్ 2: విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధి పొడ్చన్ పల్లి తండాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్త్స్ర శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం  వివరాలు...

తండాకు చెందిన ధరావత్ మోహన్(44) ఇటీవల ఇంటి పరిసరాల్లో  నిర్మించిన బాత్ రూం గోడలు క్యూరింగ్ కోసం నీటిని పట్టేందుకు ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద ఉన్న సంపులో నీటిని మోటారు ద్వారా  నీటిని పడుతుండగా ప్రమాదవశత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుఎస్‌ఐతెలిపారు.