25 August, 2026 | 12:06 PM

వడదెబ్బతో వ్యక్తి మృతి

22-05-2026 09:13 PM

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డుకు చెందిన సుంచు శ్రీనివాస్(58) వడదెబ్బకు గురై శుక్రవారం  మృతి చెందిన సంఘటన యాదగిరిగుట్టలో చోటుచేసుకుంది. పాత గుట్ట ఆలయానికి వెళ్లే దారిలో ఒక చిన్న రేకుల షెడ్డులో ఆయన ఒక దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో వడగాలులు ఎండల తీవ్రతకు రెకుల షెడ్డు వేడికి ఆయన తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు.

గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉండడంతో పాటుగా తీవ్రమైన ఎండలతో వడదెబ్బ తగిలి ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురై సోమసిలి పడిపోయారు. దీంతో అక్కడున్నవారు గమనించి ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనను పరిశీలించిన అనంతరం మృతి చెందినట్లు ధృవీకరించారు.తీవ్రమైన ఎండలతో వడదెబ్బకు గురై 58 సంవత్సరాల వయసుగల  సుంచు శ్రీనివాస్ మృతి చెందినట్లు వారు తెలిపారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అధికారులు తగిన విధంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు