22 May, 2026 | 10:07 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు

22-05-2026 09:03 PM

100 డయల్‌కు స్పందించిన పోలీసులు.

ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

కారేపల్లి,(విజయక్రాంతి): సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పోలంపల్లి గ్రామానికి చెందిన గూగులోత్ విజయ భర్త పేరు కిషన్ అనే మహిళ తన రోజువారీ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మార్గమధ్యలో కారులో కూర్చొని మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటన చోటుచేసుకుంది. భాగ్యనగర్ తండాకు చెందిన నెట్ షాప్ నిర్వాహకుడు వాంకుడోత్ బన్సీలాల్, ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన మెకానిక్ పచ్చిపాల వెంకట్‌లు నకిలీ విలేకరుల ముసుగులో చలామణి అవుతూ వారితోపాటు ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో బాధితురాలు వెంటనే 100 డయల్‌కు ఫోన్ చేయగ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, వారు మద్యం సేవిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.