22 May, 2026 | 10:11 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్

22-05-2026 09:05 PM

బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బరంగెడ్గి గ్రామం వద్ద వన్య ప్రాణులను గురువారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. రుద్రూర్‌కు చెందిన రవి, బోధన్‌కు చెందిన రాజుగా గుర్తించారు. మద్నూర్ మండలం నుంచి ఏదు (ముళ్ల పందులను) కొనుగోలు చేసి ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తుండగా బాన్సువాడ అటవీ రేంజ్ అధికారి హబీబ్ ఆధ్వర్యంలో అధికారులు పట్టుకున్నారు. ముళ్ళ పందులను ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు.నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.